Srilanka Elections : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా కమ్యూనిస్ట్ నాయకుడు అనుర కుమార దిస్సనాయకే (Anura Kumara Dissanayake) ఎన్నికయ్యారు. లంకకు 9వ అధ్యక్షుడిగా ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. దాంతో, వరుసగా రెండోసారి ప్రెసిడెంట్ అవ్వాలనుకున్న రణిల్ విక్రమసింఘే (Ranil Wickramasinghe)కు ఎదురుదెబ్బ తగిలింది.
సెప్టెంబర్ 21న శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక ఎన్నికల్లో ఎర్ర జెండా ఎగిరింది. దాదాపు 24 ఏండ్ల తర్వాత అధ్యక్ష పీఠంపై కమ్యూనిస్ట్ నాయకుడు కూర్చోబోతున్నాడు. అనుర 42.31 శాతం ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి సజీత్ ప్రేమదాసపై గెలుపొందారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఆధిక్యం ఆధారంగా అధికారులు అనుర కుమారను విజేతగా ప్రకటించారు. విక్రమసింఘే మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సెప్టెంబర్ 30వ తేదీన లంక 9వ అధ్యక్షుడిగా అనుర కుమర ప్రమాణస్వీకారం చేయనున్నారు.
National People’s Power leader #AnuraKumaraDissanayake wins the Presidential election defeating Opposition leader Sajith Premadasa of the Samagi Jana Balawegaya after two rounds of counting. pic.twitter.com/UXyAyyseWI
— All India Radio News (@airnewsalerts) September 22, 2024
The ‘communist’ candidate, Anura Kumara Dissanayake, led the early counting in Sri Lanka’s presidential elections. Early results showed JVP #Srilanka leader Mr. Dissanayake leading with about 52 percent of the votes counted so far. pic.twitter.com/gw4CwKD0Lx
— Hammer Magz (@HammerMagz) September 22, 2024
గత ఏడాది అంతర్గత సంక్షోభంతో అట్టుడికిన శ్రీలంకలో ప్రజలు మార్పు కోరుకున్నారు. 1980 తర్వాత మరోసారి కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అవినీతికి తావులేని ‘స్వచ్ఛమైన పాలన’ నినాదంతో ఎన్నికల్లో పోటీ పడిన అనుర కమార ఓటర్లను ఆకర్షించారు. విక్రమసింఘే పాలనలో గాడీ తప్పిన ఆరోగ్యం, విద్యా, రవాణా రంగాలపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవన్నీ ఇనుర కుమార పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాయి.