జైపూర్: రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. (clash between two groups) ఈ నేపథ్యంలో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డాడు. దీంతో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. బుల్డోజర్తోపాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రూపన్గఢ్ ప్రాంతంలో జైన సమాజ్ గ్రూపునకు చెందిన స్థలంలో నిర్మాణంపై రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఒక వర్గం ఈ నిర్మాణాన్ని వ్యతిరేకించింది. సర్పంచ్ ఆ భూమిని అక్రమంగా లీజుకు తీసుకున్నారని ఆరోపించింది. అయితే జైన సమాజ్ గ్రూపు యజమాని ఈ వివాదానికి దూరంగా ఉన్నాడు.
కాగా, ఆదివారం రెండు వర్గాల మధ్య వాగ్వాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు కర్రలు, ఐరన్ రాడ్లతో దాడులకు పాల్పడ్డారు. అల్లరి మూకలు రెచ్చిపోయాయి. జేసీబీతోపాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ హింసాకాండలో జరిగిన కాల్పుల్లో షకీల్ లంగా అనే యువకుడు మరణించాడు. నారాయణ్ కుమావత్ తీవ్రంగా గాయపడ్డాడు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. హింసకు పాల్పడిన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, రెండు వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
अजमेर के रूपनगढ़ में अंधाधुंध फायरिंग हुई, जिसमें एक व्यक्ति की मौत हो गई।
गाड़ियों में तोड़फोड़, जेसीबी को आग लगाई और लोगों को स्कॉर्पियो से कुचलने की कोशिश की गई। यह घटना गंभीर है! 😡#Ajmer #BreakingNews #AjmerNews #Violence #AjmerViolence pic.twitter.com/QPvKS5hxHJ— Shubham Singh (@Shubhamsingh038) September 22, 2024