Life style | మహిళలూ అందుకోసం ఆర్టిఫిషియల్ లూబ్రికేంట్స్ వాడుతున్నారా.. అయితే మీరు ఇవి తెలుసుకోవాల్సిందే..!
Life style | మహిళల్లో ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో సహజ లూబ్రికెంట్స్ విడుదల కావు. దాంతో శృంగార సమయంలో వారు తీవ్రమైన నొప్పిని అనుభవించాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం కృత్రిమ లూబ్రికెంట్స్‌ను వాడుతుంటారు. కానీ అది ప్రమాదకరమని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు వాడకూడదంటున్న ఆ ఆర్టిఫిషియల్ లూబ్రికేంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
Health tips : ఆకలి, దప్పికల తర్వాత మనిషి జీవితంలో అత్యంత ప్రాధాన్యం ఉన్నది శృంగారానికే. ఎందుకంటే శృంగారం సృష్టి కార్యం. అయితే ఈ విషయంలో చాలామంది చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటుంటారు. పురుషుల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంగస్తంభన, శీఘ్ర స్కలనం లాంటి సమస్యలు ప్రధానంగా వినిపిపిస్తాయి. మహిళల్లో ముఖ్యంగా మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో సహజ లూబ్రికెంట్స్ విడుదల కావు. దాంతో శృంగార సమయంలో వారు తీవ్రమైన నొప్పిని అనుభవించాల్సి వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం కృత్రిమ లూబ్రికెంట్స్‌ను వాడుతుంటారు. కానీ అది ప్రమాదకరమని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. నిపుణులు వాడకూడదంటున్న ఆ ఆర్టిఫిషియల్ లూబ్రికేంట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
పెట్రోలియం జెల్లీ
సాధారణంగా చాలామంది దంపతులు శృంగార సమయంలో నొప్పిగా ఉంటుందని ఉపశమనం కోసం పెట్రోలియం జెల్లీని వినియోగిస్తుంటారు. అయితే, ఇలా చేయడం కరెక్టు కాదంటున్నారు వైద్య నిపుణులు. పెట్రోలియం జెల్లీవల్ల స్త్రీల జననావయవాల్లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని, ఇది రకరకాల సుఖ వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
జారుడు పదార్థాలు
మరి కొంత మంది మీగడ లాంటి జారుడు పదార్థాలను కృత్రిమ లూబ్రికెంట్స్‌గా ఉపయోగిస్తుంటారు. అలా జారుడు పదార్థాల వినియోగం కూడా ఆరోగ్యానికి అనర్థమేనని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమ లూబ్రికెంట్స్‌గా రకరకాల జారుడు పదార్థాలను వినియోగించడంవల్ల స్త్రీ, పురుష జననేంద్రియాల్లో ఇన్ఫెక్షన్లు సోకుతాయని హెచ్చరికలు చేస్తున్నారు.
బాడీ లోషన్, ఆలివ్ ఆయిల్
అదేవిధంగా శృంగార సమయంలో నొప్పి రాకుండా ఉండేందుకు ఇంకొంత మంది మహిళలు కాస్మటిక్ బాడీ లోషన్‌ను కృత్రిమ లూబ్రికెంట్‌గా వాడుతుంటారు. అది కూడా అసహజమైన పద్ధతేనని గైనిక్ నిపుణులు చెబుతున్నారు. మరి కొందరు ఆలివ్ ఆయిల్‌ను ఆర్టిఫిషియల్ లూబ్రికెంట్‌గా వినియోగిస్తారని అది కూడా అంత శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ పరిష్కారం..
సహజంగా స్త్రీ జననాంగాల్లో విడుదలయ్యే సహజ లూబ్రికెంట్స్తోనే శృంగారాన్ని ఎంజాయ్ చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మోనోపాజ్ దశలో ఉన్న మహిళలు సమస్య పరిష్కారం కోసం లూబ్రికెంట్స్‌గా కండోమ్స్ వాడాలని, వాటిలో ఉండే లేటెక్స్ పదార్థం కృత్రిమ లూబ్రికెంట్‌గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. గర్భనిరోధక నియమాలను పాటించేవారు కూడా జెల్లీలు, లోషన్ల జోలికి వెళ్లకుండా కండోమ్స్ వాడటమే ఉత్తమమని సలహా ఇస్తున్నారు.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

