Anti Mask Protester Died | కొవిడ్ 19 ప్రబలుతున్నా మాస్క్‌లు పెట్టుకోవద్దంటూ.. యాంటీ మాస్క్ ర్యాలీని నిర్వహించిన యూఎస్‌లోని టెక్సాస్‌కు చెందిన 30 ఏళ్ల సెలబ్ వాల్లెస్ అనే వ్యక్తి అదే కొవిడ్ 19తో మృతి చెందాడు. గత శనివారమే ఆయన కరోనాతో మృతి చెందినా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
టెక్సాస్‌లోని సాన్ అంగెలో ఆసుపత్రిలో నెల రోజుల పాటు ఆయన కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఆయన భార్య వెల్లడించింది. సెలబ్కు ముగ్గురు పిల్లలు ఉండగా.. ప్రస్తుతం ఆయన భార్య గర్భిణీగా ఉంది. సెలబ్.. సమ్మర్లో యాంటీ మాస్క్ ర్యాలీని నిర్వహించి టెక్సాస్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అలాగే.. ఆయన The San Angelo Freedom Defenders అనే గ్రూప్‌ను స్థాపించి.. ఆ గ్రూప్‌నకు ఆర్గనైజర్‌గా ఉండేవాడు. ఆ గ్రూప్ ద్వారా.. ప్రజలను చైతన్యపరచడం, ఎడ్యుకేట్ చేయడం, వాళ్లకు పలు విషయాలపై అవగాహన కల్పించడం చేసేవాడు. కరోనా ప్రబలడం స్టార్ట్ అయ్యాక.. కరోనా మీద అవగాహన కల్పించడం ప్రారంభించాడు. మాస్క్ వేసుకొని.. స్వచ్ఛమైన గాలిని పీల్చకుండా చేసే హక్కు ఎవరిచ్చారు. పౌరుల స్వేచ్ఛా హక్కులకు మాస్క్ భంగం కలిగిస్తోందంటూ ఆయన ఉద్యమించాడు.
గత జులైలోనే ఆయన కరోనా లక్షణాలు ఉన్నా.. కరోనా టెస్ట్ చేయించుకునేందుకు సెలబ్ నిరాకరించారని తన భార్య వెల్లడించింది. తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్పించారు. నెల రోజుల పాటు ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు.
Caleb Wallace, head of ‘San Angelo Freedom Fighters’ to “end covid tyranny” is sedated on a ventilator. He has 3 kids and wife pregnant. He treated himself with ivermectin. Here he in interview: “The science is out there, and it’s saying this is perfectly fine to live with.” pic.twitter.com/zCgUdwbbuC
— Ron Filipkowski (@RonFilipkowski) August 27, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆ ఊళ్లో మహిళలకు ఒక భాష.. పురుషులకు మరో భాష.. ఒకే ఊరిలో రెండు భాషలు
Internet Apocalypse : ఇంటర్నెట్ యుగాంతం వచ్చేసినట్టేనా? దూసుకొస్తున్న భారీ సౌర తుఫానే కారణమా?