ఆరోజోనా: అగ్రరాజ్యం అమెరికాలో విమాన ప్రమాదాలు (Plane Crash) కొనసాగుతూనే ఉన్నాయి. అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం స్వీకారం చేసిన నెల రోజుల వ్యవధిలోనే నాలుగు విమాన ప్రమాదాలు చోటుచేసుకోగా.. తాజాగా మరో రెండు విమానాలు ప్రమాదానికి గురయ్యాయి. ఆరిజోనా రాష్ట్రంలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు మృతిచెందారు. బుధవారం ఉదయం (స్థానిక కాలమానం ప్రకారం) టస్కాన్ శివార్లలోని మారానా రీజినల్ ఎయిర్పోర్ట్ సమీపంలో రెండు చిన్న విమానాలు ఢీకొని నేలకూలాయని ఫెడరల్ ఎయిర్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ భారీగా మంటలు ఎగసిపడ్డాయని చెప్పారు. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించారని తెలిపారు. గత నెల రోజుల్లో అమెరికాలో ఇది ఐదో విమాన ప్రమాదం.
జనవరిలో వాషింగ్టన్ సమీపంలో మిలిటరీ హెలికాప్టర్‌ను అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో 67 మంది మరణించారు. ఈ నెల మొదటివారంలో ఫిలడెల్ఫియాలో ఓ విమానం ఇండ్లపై కూలిపోయింది. దీంతో ఆరుగురు మరణించారు. గతవారం ఆరిజోనాలో లియర్‌జెట్ 35ఏ విమానం ల్యాండింగ్ తర్వాత రన్‌వే నుంచి జారి ర్యాంప్‌పై ఉన్న బిజినెస్ జెన్ ఢీకొట్టింది. స్కాట్‌డేల్ ఎయిర్‌పోర్డ్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో నలుగురు గాయపడ్డారు. ఇక రెండు రోజుల క్రితం ఫిలడెల్ఫియాలో మెడికల్ ట్రాన్స్పోర్ట్ జెట్ విమానం కుప్పకూలడంతో ఏడుగురు మరణించగా, 19 మంది గాయపడ్డారు. కాగా, ఈ నెల 18న అమెరికా నుంచి కెనడా రాజధాని టొరంటోకు వెళ్తున్న విమానం రన్‌వేపై జారిపడిన విషయం తెలిసిందే. దీంతో ఒకరు మృతిచెందారు.
Airplane OPS:
Stay off of planes until these ops are neutralized if you can help it.
🚨Arizona plane collision leaves approximately 2 dead
City officials confirm 2 small aircraft involved in the mid-air collision.
UPDATE: Two small planes collided in midair above the… pic.twitter.com/xUjD8mUmTr
— WayneTech SPFX®️ (@WayneTechSPFX) February 19, 2025