Watch: విమానం గాల్లో ఉండగా.. కొట్టుకున్న ఇద్దరు ప్రయాణికులు
విమానం గాల్లో ఎగురుతుండగా ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకు దిగారు. చొక్కా తీసేసి ఉన్న యువకుడు, పక్క సీటు వ్యక్తి మధ్య గొడవ జరిగింది.
ఢాకా: విమానం గాల్లో ఉండగా అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు కొట్టుకున్నారు. ఒకరిపై మరొకరు పంచ్‌లు ఇచ్చుకున్నారు. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ దేశ జాతీయ విమానయాన సంస్థ బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ కోట్లాట జరిగింది. ఆ సంస్థకు చెందిన బోయింగ్ 777 విమానం గాల్లో ఎగురుతుండగా ఇద్దరు ప్రయాణికులు ఘర్షణకు దిగారు. చొక్కా తీసేసి ఉన్న యువకుడు, పక్క సీటు వ్యక్తి మధ్య గొడవ జరిగింది. దీంతో పైకి లేచిన ఆ యువకుడు సీటులో కూర్చొని ఉన్న వ్యక్తిపై పంచ్‌లు ఇచ్చాడు. మరోవైపు సీటులో కూర్చొన్న వ్యక్తి కూడా యువకుడి చెంపపై కొట్టాడు. ఇంతలో తోటి విమాన ప్రయాణికులు, విమాన సిబ్బంది జోక్యం చేసుకున్నారు. వారిద్దనీ విడదీశారు. విమానంలోని కొందరు ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన వీడియో క్లిప్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఇటీవల థాయ్ స్మైల్ ఎయిర్వేస్ విమానంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాకు ప్రయాణిస్తున్న విమానంలో ఇద్దరు ప్రయాణికులు గొడవ పడ్డారు. క్యాబిన్ సిబ్బంది పేర్కొన్న భద్రతా సూచనలను పాటించేందుకు ఒక వ్యక్తి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో మరోవ్యక్తి జోక్యం చేసుకోవడంతో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
Another "Unruly Passenger" 👊
This time on a Biman Bangladesh Boeing 777 flight!🤦♂️ pic.twitter.com/vnpfe0t2pz— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) January 7, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

