HomeInternationalAnalyst Discusses North Koreas Claims Of 1 4m Youths Joining Its Army Amid Tensions With South
ఉత్తర కొరియా ఆర్మీలో వారంలో 14 లక్షల మంది చేరిక
ఒక వైపు దక్షిణ కొరియాతో ఉన్న మార్గాలను పేల్చివేయడం ద్వారా సరిహద్దులను శాశ్వతంగా మూసివేస్తున్న కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం మరో సంచలన చర్యకు తెరతీసింది.
ప్యాంగ్యాంగ్ (ఉత్తర కొరియా), అక్టోబర్ 16: ఒక వైపు దక్షిణ కొరియాతో ఉన్న మార్గాలను పేల్చివేయడం ద్వారా సరిహద్దులను శాశ్వతంగా మూసివేస్తున్న కిమ్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ప్రభుత్వం మరో సంచలన చర్యకు తెరతీసింది. ఎప్పుడు యుద్ధం వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా లక్షలాది మంది యువకులను ఆర్మీలో చేర్చుకుంటున్నది.
కేవలం ఈ వారంలోనే 14 లక్షల మంది యువత స్వచ్ఛందంగా ఆర్మీలో చేరిక లేదా నమోదు చేయించుకున్నట్టు ఆ దేశ మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. పవిత్ర యుద్ధంలో శత్రువును అంతం చేస్తామని ఈ దేశ యువత ప్రతిజ్ఞ చేసినట్టు తెలిపింది.
ఈ సందర్భంగా ఉత్తర కొరియా యువత ఆర్మీలో చేరేందుకు పిటిషన్లపై సంతకం చేస్తున్న ఫొటోలను కేసీఎన్ఏ విడుదల చేసింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతల క్రమంలోనే ఈ రిక్రూట్మెంట్ చేపట్టినట్టు పేర్కొంది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్లో దక్షిణ కొరియా డ్రోన్లు చొరబడటానికి ప్రయత్నించినట్టు కిమ్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను దక్షిణ కొరియా ఖండించింది.