న్యూఢిల్లీ: కువైట్‌పై ఇరాన్ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్తు, నీటి శుద్ధి ప్లాంట్‌పై జరిపిన బాంబు దాడుల్లో భారతీయుడు చనిపోయినట్టు భారత ఎంబసీ సోమవారం వెల్లడించింది. ఘటనపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి సాధ్యమైన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నామని తెలిపింది.
కువైట్ అధికారులతో సమన్వయం చేస్తున్నట్టు భారత కార్యాలయం ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపింది. తమ విద్యుత్తు, నీటి శుద్ధి కర్మాగారాల్లో ఒకదాని సేవా భవనం ఇరాన్ దాడిలో దెబ్బతిన్నట్టు కువైట్ విద్యుత్తు, జల, ఇంధన శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల్ని ‘క్రూరమైనవి’గా కువైట్ అధికారులు పేర్కొన్నారు.