Helicopter Crashed | నేపాల్లో ఘోర ప్రమాదం సంభవించింది. నువాకోట్ జిల్లాలో ఎయిర్ డైనస్టీ (Air Dynasty) హెలికాప్టర్ కుప్పకూలింది (Helicopter Crashed). ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నువాకోట్ (Nuwakot)లోని శివపురి ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం హెలికాప్టర్ కూలిపోయినట్లు ఎస్పీ శాంతిరాజ్ కొయిరాలా తెలిపారు.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. హెలికాప్టర్ నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి రాసువాకు వెళ్తుండగా.. నువాకోట్ జిల్లాలోని సూర్య చౌర్ – 7 వద్ద కొండను ఢీ కొట్టింది. దీంతో విమానం ప్రమాదానికి గురై కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
An Air Dynasty helicopter has crashed in Nepal’s Nuwakot District: SP Shantiraj Koirala
More details awaited.
— ANI (@ANI) August 7, 2024
Also Read..
Vinesh Phogat | తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వినేశ్ ఫొగాట్..?