Vinesh Phogat | పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షాక్ తగిలింది. రెజ్లింగ్ ఫైనల్‌కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పతకం ఆశలు గల్లంతయ్యాయి. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్‌కు గురి చేసింది. దీంతో ఫొగాట్‌పై అనర్హత వేటు అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ (Lok Sabha)లో లేవనెత్తారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీలు పట్టుబట్టారు. స్పందించిన ప్రభుత్వం వినేశ్ ఫొగాట్ అంశంపై ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర క్రీడా మంత్రి ప్రకటన చేస్తారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు.
#WATCH | Delhi: Opposition MPs raise the issue of disqualification of Indian wrestler Vinesh Phogat from #ParisOlympics2024, in Lok Sabha
Union Minister Arjun Ram Meghwal says, ‘Union Sports Minister will give a statement on this matter at 3 pm today.” pic.twitter.com/kFqle3uSQc
— ANI (@ANI) August 7, 2024
కాగా, 50 కేజీల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్‌లో పోటీ చేసిన వినేశ్ ఫోగట్.. ఫైనల్‌కి ప్రవేశించింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. దీంతో అంతా పతకం ఖాయమని అనుకున్నారు. అయితే, అనూహ్యంగా బరువు పెరిగిన కారణంగా ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన 50 కేజీల బరువు కంటే ఫొగాట్ 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. అనర్హత కారణంగా ఆమె పతకం గెలిచే అవకాశం కోల్పోయింది.
Also Read..
PM Modi: రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై వేటు బాధిపెడుతోంది: ప్రధాని మోదీ
Vinesh Phogat | రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పతకం ఆశలు గల్లంతు.. అధిక బరువు కారణంగా అనర్హత వేటు..!
Pole Vaulter: పోల్‌వాల్ట్ అథ్లెట్‌కు పోర్న్ సైట్ భారీ ఆఫర్