పారిస్: ఫ్రాన్స్‌కు చెందిన పోల్‌వాల్ట్(pole vaulter) ఆటగాడు ఆంథోనీ అమ్మిరాటికి .. ఓ పోర్న్ సైట్ కంపెనీ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పోల్‌వాల్ట్ చేసిన అమ్మిరాటి.. వాస్తవానికి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. కానీ క్వాలిఫైయింగ్ రౌండ్స్‌లో అతను చేసిన పోల్ వాల్టింగ్ జంప్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒకవేళ అమ్మిరాటి పోర్న్ సైట్లో నటిస్తే, అతనికి రెండున్నర లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు కామ్‌సోడా వెబ్సైట్ ప్రకటన చేసింది.
ఇంతకీ పారిస్ ఈవెంట్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 21 ఏళ్ల అమ్మిరాటి.. పోల్ బార్‌తో.. హెయిట్ బార్‌ను జంప్ చేసేందుకు ట్రై చేశాడు. సుమారు 5.70 మీటర్ల ఎత్తులో ఉన్న హైట్ బార్‌ను జంప్ చేయబోయాడు. జంప్ సమయంలో అతను దాదాపు హైట్ బార్‌ను క్లియర్ చేశాడు. కానీ ఓ చిన్న పొరపాటు జరిగింది. జంపింగ్ సమయంలో ఆ అథ్లెట్ వృషణాలు.. హైట్ బార్‌ను తాకాయి. దీంతో ఆ హైట్ బార్ కిందపడిపోయింది. అమ్మిరాటి డిస్క్వాలిఫై అయ్యాడు.
పారిస్ పోల్‌వాల్ట్ ఈవెంట్లో అతను 12వ స్థానం సంపాదించాడు. ఫైనల్స్‌కు అర్హత సాధించని అతనికి కామ్‌సోడా పోర్న్ సైట్ వాళ్లు మాత్రం భారీ ఆఫర్‌ను ప్రకటించారు. వెబ్‌కామ్ షోకు 60 నిమిషాల సమయం కేటాయిస్తే, రెండున్నర లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు కామ్‌సోడా సీఈవో డార్ని పార్కర్ తెలిపారు.
French athlete Anthony Ammirati failed the 5.70 height pole vault because of his asset. #IKYK #Paris2024 https://t.co/qWnr1QbFzy
— @pauloinmanila and 99 others (@pauloMDtweets) August 3, 2024