US Flights : అమెరికావ్యాప్తంగా అమెరికా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్య కారణంగా విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సమస్యను పరిష్కరించి విమానాల రవాణాను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అమెరికా ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు.
క్రిస్మస్ పండుగ సందర్భంగా దేశీయంగా ఎక్కువగా రాకపోకలు జరిగే సమయంలో విమానాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే డొమెస్టిక్ విమానాల రాకపోకలు నిలిచిపోవడానికి సరైన కారణం ఏమిటో అమెరికా ఎయిర్‌లైన్స్ ఇంకా స్పష్టం చేయలేదు.