వాషింగ్టన్: కరోనా వైరస్ విజృంభణతో కష్టకాలంలో ఉన్న భారత్‌కు సాయం కొనసాగిస్తామని అమెరికా ప్రకటించింది. ఇందులో భాగంగా 100 మిలియన్ డాలర్ల విలువైన వైద్య సామగ్రిని భారత్‌కు పంపిస్తున్నామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. వైద్య సామాగ్రి సరఫరా చేసేందుకు కొనసాగుతున్న చర్యలకు సంబంధించి అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
‘కరోనాతో పోరాడుతున్న భారత్‌కు సాయం చేసేందుకు అమెరికా కట్టుబడి ఉంది. భారత్‌లో ఆరోగ్య కార్యకర్తలకు శక్తిమేరకు సాయంచేస్తాం. కరోనాకు సంబంధించిన అత్యవసర పరికరాలు గురువారం భారత్‌కు బయలుదేరుతున్నాయి. ఈ ప్రక్రియ వారం రోజులపాటు కొనసాగుతుంది. వాటిలో వెయ్యి ఆక్సిజన్ సిలిండర్లు, కోటీ 50 లక్షల ఎన్-95 మాస్క్‌లు, 10 లక్షల ర్యాపిడ్ కిట్లు ఉన్నాయి. అంతేకాకుండా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీ సామగ్రిని భారత్‌కు పంపిస్తున్నామని, దీనిద్వారా రెండు కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను తయారు చేయవచ్చు’ అని తెలిపింది. కరోనాపై పోరులో భాగంగా యూఎస్ ఎయిడ్ కింద ఇప్పటికే నేరుగా కోటి మందికి సాయం అందించామని వెల్లడించింది. త్వరలో మరో వెయ్యి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేస్తామని పేర్కొంది.
Reflecting the United States’ solidarity with India as it battles a new wave of COVID-19 cases, the United States is delivering supplies worth more than $100 million in the coming days to provide urgent relief to our partners in India: White House pic.twitter.com/PYsR1Flb69
— ANI (@ANI) April 29, 2021
‘కరోనా మహమ్మారి ఆరంభంలో భారత్ తమకు సహాయం చేసిందని, అదేవిధంగా ప్రస్తుతం కష్టాల్లో ఉన్న భారత్‌ను ఆదుకోవాలని అమెరికా నిర్ణయించిందని’ వైట్‌హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో పేర్కొన్నది.
Thanks to @US_TRANSCOM, @AirMobilityCmd, @Travis60AMW & @DLAmil for hustling to prepare critical @USAID medical supplies for shipping. As I've said, we’re committed to use every resource at our disposal, within our authority, to support India’s frontline healthcare workers. pic.twitter.com/JLvuuIgV46
— Secretary of Defense Lloyd J. Austin III (@SecDef) April 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..