న్యూయార్క్, నవంబర్ 19: అమెరికాకు ‘బాంబ్ సైక్లోన్’ ముప్పు పొంచి ఉంది. ముంచుకొస్తున్న తీవ్ర తుఫానుతో అనేక రాష్ర్టాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. గంటల వ్యవధిలోనే గణనీయంగా బలపడే తుఫానును ‘బాంబ్ సైక్లోన్’ అని పిలుస్తారు. తుఫాను తీరం చేరే సమయంలో హారికేన్ స్థాయిలో భీకర గాలులు వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, పర్వత ప్రాంతాల్లో మంచు పడొచ్చని వాతావరణ శాఖ సూచించింది.
ముఖ్యంగా దక్షిణ ఓరెగన్, ఉత్తర కాలిఫోర్నియాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. తుఫాను ముప్పు ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం అప్రమత్తం చేస్తున్నది.