వాషింగ్టన్ : అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభణ ఆందోళన కలిగిస్తున్నది. ఇటీవలి వరకు కేవలం పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లు, పక్షులకు మాత్రమే సోకిన ఈ వైరస్ను తాజాగా అమెరికాలోని 31 రాష్ర్టాల్లో పిల్లుల్లో కూడా గుర్తించారు. కుక్కలకు కూడా ఈ వైరస్ సోకినట్లు కొన్ని కేసులు నమోదయ్యాయి. దీంతో పెంపుడు జంతువుల యజమానులకు ఈ వైరస్ సోకే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
అమెరికన్ మీడియా కథనాల ప్రకారం, ఈ వైరస్ 12 రాష్ర్టాల్లోని ఎలుకలు, నక్కలు, పర్వత ప్రాంతాల్లోని సింహాలు, ఆవులకు సోకినట్లు సమాచారం. మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలోని రిసెర్చర్ క్రిస్టెన్ కోల్మన్ మాట్లాడుతూ, ఇళ్లలోని పెంపుడు పిల్లులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.