అదానీపై ఆ ఫ్రాడ్ కేసు గాయబ్!
భారత్‌లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు ఇక్కడి అధికారులకు 265 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారన్న కేసులో వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఊరట లభించింది.
- ఉపసంహరించుకోబోతున్న అమెరికా: బ్లూమ్‌బర్గ్
హైదరాబాద్, మే 14 ( స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): భారత్‌లో సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులు దక్కించుకొనేందుకు ఇక్కడి అధికారులకు 265 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు ఇవ్వజూపారన్న కేసులో వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి ఊరట లభించింది. ఈ కేసులో అదానీపై మోపిన క్రిమినల్, సివిల్ ఫ్రాడ్ అభియోగాలను ఉపసంహరించుకోవడానికి అమెరికా సిద్ధమైంది.
ఈ మేరకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్‌తో పాటు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కేసులను వెనక్కి తీసుకోనున్నట్టు బ్లూమ్‌బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది. దీనికి సంబంధించి ఈ వారంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. కాగా ఈ స్కామ్‌లో అదానీకి నోటీసులు జారీచేయడానికి తమకు సాయం చేయడం లేదంటూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఎస్ఈసీ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదానీపై ఉన్న ఈ కేసును అమెరికా అధికారులు ఉపసంహరించుకోవడంపై పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

