Amber Heard | ప్రముఖ హాలీవుడ్ నటి అంబర్ హర్డ్ గురించి తెలిసే ఉంటుంది. తన మాజీ భర్త, అమెరికన్ నటుడు జానీడెప్తో కోర్టు వివాదంలో ఓడిపోయి ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఈమె టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాజీ ప్రయురాలు కూడా. గతంలో వీరిద్దరూ సహజీవనం కూడా చేశారు. అయితే కొన్ని కారణాల కారణంగా విడిపోయి ఎవరి దారి వారు చూసుకున్నారు.
అయితే, ఈ నటి తాజాగా ట్విట్టర్‌ను వీడింది. దీంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అంబర్.. తన ట్విట్టర్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేసిందా..? లేక ఇన్ యాక్టివ్‌లో ఉంచిందా..? అంటూ ఆరాతీస్తున్నారు. ఇదే సమయంలో అంబర్ ట్విట్టర్ అకౌంట్‌ను మస్క్ డీ యాక్టివేట్ చేశాడా? అని కూడా అనుమానిస్తున్నారు. ఏదేమైనా అంబర్ ట్విట్టర్‌ను వీడటం పలు చర్చలకు దారి తీస్తోంది. ట్విట్టర్‌ను మస్క్ కొనుగోలు చేయడం వల్లనే ఆమె ఈ పని చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నారు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్. ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలతో పలు మార్పులు చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్‌ను మస్క్ తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత పలువురు సెలబ్రిటీలు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్‌ను వీడిన విషయం తెలిసిందే. ఆ జాబితాలోకి తాజాగా అంబర్ వచ్చి చేరింది.