ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక అమెజాన్ డెలివరీ ఏజెంట్.. దాన్ని చూసి వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించింది. వాళ్లు వచ్చే వరకు అక్కడే ఉండి, వారికి ఆ ఇంటిని చూపించింది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. ఆ ఇంట్లో మంటలు ఆర్పేశారు. అదే సమయంలో పొగతో ఊపిరాడక స్పృహతప్పిన మూడు కుక్కపిల్లలను కాపాడారు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో వెలుగు చూసింది.
ఇదే విషయాన్ని కొలంబియా కౌంటీ ఫైర్ రెస్క్యూ (సీసీఎఫ్ఆర్) విభాగం సోషల్ మీడియాలో పంచుకుంది. సదరు అమెజాన్ డెలివరీ ఏజెంట్‌ను ఏంజెలీనా స్టార్కీగా నెటిజన్లు గుర్తించారు. ఆమె సమయానికి తమకు ఫోన్ చెయ్యడంతో మంటలు ఆర్పడంతోపాటు కుక్క పిల్లలను కాపాడగలిగామని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఇంటి ఓనర్ లారెన్ సట్టాన్ మాట్లాడుతూ.. ఏంజెలినాకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తన కుక్క పిల్లలు ఆస్పత్రిలోనే ఉన్నాయని, అయితే వాటి ఆరోగ్యం కుదుటపడిందని వెల్లడించారు.
During a structure fire yesterday, 3 puppies were saved and revived from smoke inhalation. Thank you to the Amazon…
Posted by Columbia County Fire Rescue on Wednesday, August 31, 2022