టోక్యో: జపాన్లోని పాత్ టు రీబర్త్ రాజకీయ పార్టీ సారథ్య బాధ్యతలను కృత్రిమ మేధ (ఏఐ) చేపట్టబోతున్నది. మాజీ మేయర్ షింజి ఇషిమరు ఈ ఏడాది జనవరిలోనే ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ ఏడాదిలో జరిగిన ఎగువ సభ ఎన్నికల్లో ఈ పార్టీకి చెప్పుకోదగ్గ విజయాలు లభించలేదు.
దీంతో ఇషిమరు రాజీనామా చేశారు. ఈ పార్టీకి నామమాత్రపు అధినేతగా డాక్టొరల్ స్టూడెంట్ కొకి ఒకుముర (25) వ్యవహరిస్తారు. కొకి మాట్లాడుతూ, తమ పార్టీకి అధినేతగా ఏఐ వ్యవహరిస్తుందని చెప్పారు. సభ్యుల రాజకీయ కార్యకలాపాలను ఈ ఏఐ అధినేత నిర్దేశించదని తెలిపారు. సభ్యుల మధ్య వనరుల పంపిణీ వంటి నిర్ణయాలపై దృష్టి సారిస్తుందన్నారు.