లాహోర్ : పాకిస్థాన్లోని లాహోర్ లో గాలి కాలుష్యం తీవ్రంగా పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పరిమితి కన్నా 40 రెట్లు పెరిగింది. దీంతో ప్రపంచంలోని అత్యధిక కాలుష్యం గల నగరాల జాబితాలో లాహోర్ ప్రథమ స్థానంలో నిలిచింది. పంజాబ్ ప్రావిన్స్ సీనియర్ మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ, ప్రాథమిక పాఠశాలలకు ఈ నెల 4 నుంచి వారం రోజులపాటు సెలవులు ప్రకటించామన్నారు. 50 శాతం మంది ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పని చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. భారత దేశం నుంచి వస్తున్న గాలి లాహోర్లో కాలుష్యానికి కారణం అని పాక్ నేతలు ఆరోపిస్తున్నారు.