న్యూఢిల్లీ: అమెరికాలో ఓ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రారంభమైంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కృత్రిమ మేధ(ఏఐ) ఏజెంట్లు మనుషులను అద్దెకు తీసుకుంటాయి. దీన్ని రెంట్ఏహ్యూమన్.ఏఐ అని పిలుస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అలెజాడో లియాడెటెలో ఈ ప్లాట్పామ్ని ప్రారంభించారు. రోబోలకు ఇప్పుడు మానవ దేహాలు అవసరమని ఆయన చెబుతున్నారు.
ఇదెలా పనిచేస్తుందంటే ఈ వెబ్సైట్లో మనుషులు తమ ప్రొఫైల్స్‌ని క్రియేట్ చేస్తారు. తమ లొకేషన్ని, పని విధానాన్ని, గంటకు తమ వేతనాన్ని అందులో పేర్కొంటారు. ఏఐ ఏజెంట్ వారికి టాస్కులు ఇచ్చి ఆదేశాలు జారీచేస్తుంది. సాధారణంగా ఏఐ ఏజెంట్లు ఇచ్చే టాస్కులు ఎలా ఉంటాయంటే వస్తువులను సేకరించడం లేదా షాపింగ్ చేయడం, ప్రొడక్ట్స్‌ని పరీక్షించడం లేదా ఫొటోలు పోస్టు చేయడం, కొన్ని టాస్కులకు కేవలం ఒక డాలర్ చెల్లిస్తారు.