AI Act | సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. మానవ మేథస్సుతో పోటీపడే కృతిమ మేథా అందరినీ ఆకట్టుకున్నది. మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను స్వాగతించిన యావత్ ప్రపంచం.. తాజాగా జరుగుతున్న ఘటనలతో ఆందోళనలు వ్యక్తమవుతున్నది. అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఏఐతో ఇబ్బందిపడుతున్నాయి. ఏఐ టెక్నాలజీని మంచి పనులకన్నా.. పలువురు దుష్ప్రయోజనాల కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు.
ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీ నియంత్రణపై చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ ఏఐకి వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చేందుకు సిద్ధమైందని ఓ నివేదిక పేర్కొంది. అందుబాటులోకి వస్తే తొలి చట్టంగా నిలువనున్నది. ఏఐ చట్టం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధించడంతో పాటు నష్టాలను నియంత్రించనున్నది. ప్రజలకు భద్రత, జీవనోపాధి, హక్కులను పరిరక్షించనున్నది. యూరోపియన్ పార్లమెంట్ ప్రెసిడెంట్ రాబర్టా మెత్సోలా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేగంగా పెరుగుతున్న ఏఐ దుర్వినియోగాన్ని నిరోధించడానికి చట్టం అవసరమన్నారు.
యాక్ట్ అమలులోకి వస్తే.. ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ వంటి చాట్బాట్లన్నీ చట్టం పరిధిలోకి చాట్బాట్లు దాని పరిధిలోకి వెళ్లనున్నారు. వాటితో పాటు గూగుల్ బార్డ్, జెమినీ, మెటాస్ ఇమాజిన్ సైతం చట్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. డీప్‌ఫేక్‌లకు సంబంధించి త్వరలో భారత్ సైతం చట్టం తీసుకువచ్చే అవకాశాలున్నాయి. ఇటీవల సెలెబ్రటీలకు సంబంధించి ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాటికి అడ్డుకట్ట వేసేందుకు చట్టం తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది.