శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Aug 20, 2020 , 14:51:25

చైనాకు పాక్ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషి

చైనాకు పాక్ విదేశాంగ మంత్రి మెహమూద్ ఖురేషి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి మఖ్దూమ్ షా మెహమూద్ ఖురేషి గురువారం చైనాకు ప్రయాణమవుతున్నారు. ఆ దేశ విదేశాంగ కార్యదర్శి సోహైల్ మహమూద్‌తో పాటు పలువురు దౌత్య ప్రతినిధులు ఆయన వెంట వెళ్లనున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఖురేషి సమావేశమవుతారు. బెల్ట్ అండ్ రోడ్డ్ ప్రాజెక్టు, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల అంశాలతోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఈ ఏడాది జరుపనున్న పాకిస్థాన్ పర్యటనపై వారు చర్చించనున్నట్లు సమాచారం. కశ్మీర్‌పై చైనా మద్దతులోపాటు భారత్, చైనా సరిహద్దులో ఉద్రిక్తతపైనా ఖురేషి చర్చిస్తారని తెలుస్తున్నది. సౌదీ అరేబియాతో విభేదం నేపథ్యంలో ఖురేషి చైనా పర్యాటన ప్రాధాన్యత సంతరించుకున్నది.

సౌదీ నుంచి తీసుకున్న అప్పులో ఒక బిలియన్ డాలర్లను పాక్ ఇటీవల తీర్చివేసింది. ఈ అప్పు ఒప్పందంతోపాటు రాయితీ ధరకు పెట్రోల్ సరఫరా ఒప్పందం ముగిసినా సౌదీ అరేబియా పునరుద్ధరించలేదు. సౌదీని కాదని కశ్మీర్‌పై ముస్లిం దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నించడమే దీనికి కారణం. సౌదీతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తమ పాత మిత్రుడైన చైనాతోనే తమ భవిష్యత్తు ఆధారపడి ఉన్నదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఒక ఇంటర్యూలో చెప్పారు. చైనా కూడా పాకిస్థాన్‌ను బాగా కోరుకుంటున్నదని ఆయన తెలిపారు. అయితే సౌదీతో తమ సంబంధాలు దెబ్బతిన్నాయన్న వార్తలు నిరాధారమని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo