US Issues Travel Advisory | పాక్ (Pakistan)పై భారత్ దాడుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. పాక్‌లోని తమ పౌరులకు అడ్వైజరీ జారీ (US Issues Travel Advisory) చేసింది. సాయుధ దళాల సంఘర్షణకు అవకాశం ఉన్నందున భారత్-పాక్ నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ప్రాంతాలకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఈ మేరకు పాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాలకు సమీపంలో ఉన్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది. తమ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవాలని సూచించింది.
పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్.. అందుకు ప్రతీకారం తీర్చుకుంది. పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడులు చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని పూర్తిగా ధ్వంసం చేసింది. భారత్ విజయవంతంగా చేపట్టిన ఈ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కారణంగా దాదాపు 80 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.
Also Read..
Operation Sindoor | భారత్‌లో 18 ఎయిర్‌పోర్ట్‌లు మూసివేత.. 200కిపైగా విమానాలు రద్దు
Pakistan Airspace | ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఎయిర్‌స్పేస్ ఖాళీ.. బిజీగా మారిన భారత్ గగనతలం
All Party Meet | ఆపరేషన్ సిందూర్.. రేపు ఆల్ పార్టీ మీటింగ్