Afghanistan | ఫ్రీజ్ చేసిన నిధులు వదలండి.. అమెరికాకు తాలిబన్ డిమాండ్
తాలిబన్ రాజ్యం ఆప్ఘనిస్థాన్‌ను ఇటీవల భారీ భూకంపం బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ భూకంపం వల్ల సుమారు 1150 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 1600 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆ దేశంలో గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఇంతటి భూకంపం రాలేదు.
ఈ క్రమంలో ఆప్ఘాన్ ప్రభుత్వం ముందుకొచ్చి అమెరికాకు కొత్త డిమాండ్ వినిపించింది. తాలిబన్లు ఆప్ఘాన్‌ను స్వాధీనం చేసుకోవడంతో జప్తుచేసిన ఆ దేశపు నిధులను విడుదల చేయాలని కోరింది. కాబూల్‌లో విలేకరులతో మాట్లాడిన తాలిబన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖి ఇదే విషయాన్ని చెప్పారు.
‘‘ఈ కష్టకాలంలో ఫ్రీజ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ ఆస్తులను విడుదల చేయాలని, ఆఫ్ఘాన్ బ్యాంకులపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని అమెరికాను కోరుతున్నాం. ఇలా చేస్తే సహాయం చేసే ఏజెన్సీలు ఆఫ్ఘనిస్తాన్‌కు సహకారం అందించడం సులభం అవుతుంది’’ అని చెప్పారు. ఇటీవలే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ దీనికి సంబంధించిన ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు.
ఆప్ఘనిస్తాన్‌కు చెందిన మొత్తం 9 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను అమెరికా ఫ్రీజ్ చేసింది. వీటిలో 7 బిలియన్ డాలర్లను విడుదల చేయాలని ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉంది. ఈ సొమ్మును ఆప్ఘాన్‌లో హ్యుమేనిటేరియన్ సహకారానికి, 9/11 బాధితులకు అందించాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

