ఇస్లాబామాద్: ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మేటి గాయని హసీబా నూరి(Hasiba Noori) .. పాకిస్థాన్‌లో హత్యకు గురైంది. ఖైబర్ ఫక్తున్కాలోని కుజాలో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. సింగర్ హసీబా వయసు 38 ఏళ్లు. 2021లో ఆమె ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్ల నుంచి పరారీ అయి వచ్చి పాకిస్థానలో ఆశ్రయం పొందుతోంది. ఆఫ్ఘన్లో ఉన్న సమయంలో తాలిబన్లు తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె గతంలో ఆరోపించారు. ఇస్లామాబాద్‌లో ఆ గాయని తన తల్లితో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. పాస్‌తో సింగర్‌గా ఫేమస్ అయిన ఆమె గతంలో అనేక ఆఫ్ఘనీ ఛానళ్లలో పాటలు పాడేది. సబ్జా జనమ్, ఆలా యారబ్, మీనా లాంటి హిట్ పాటల్ని ఆమే పాడారు.