Afghanistan | బొమ్మైనా సరే ముఖానికి ముసుగు తప్పనిసరి.. మహిళలపై కొనసాగుతున్న తాలిబన్ల కఠిన ఆంక్షలు
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. మహిళను పోలిన బొమ్మైనా సరే ముఖం బయటకు కనిపించకూడదని రూల్స్ పెట్టారు.
Afghanistan | ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట లేకుండా మహిళలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి వీల్లేదని, బురఖా తప్పనిసరిగా ధరించాలని, బాలికల సెకండరీ స్కూళ్లు మూసివేయాలని, మహిళలు ఉద్యోగాలు చేయకూడదంటూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన తాలిబన్ నాయకులు.. దేశంలో మహిళలకు యూనివర్సిటీ విద్యపై కూడా నిషేధం విధించారు. తాజాగా అక్కడ మహిళల పట్ల ఆఫ్ఘాన్ నేతలు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో తెలియజెప్పే కొన్ని ఫొటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

ఆ దేశంలో మహిళలే కాదు.. మహిళను పోలిన బొమ్మైనా సరే ముఖం బయటకు కనిపించకూడదని రూల్స్ పెట్టారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశారు. దుకాణం ముందు, లోపల ఉన్న మహిళల బొమ్మలకు ముఖం కనిపించకుండా బురఖా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో ఆయా దుకాణదారులు బొమ్మల ముఖాలు కనిపించకుండా ప్లాస్టిక్ కవర్, క్లాత్ బ్యాగ్‌లను కప్పుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

The Taliban’s hatred of women extends beyond the living. It is now mandatory for store owners to cover the faces of mannequins.
These dystopian images are a sign of how much worse life is going to become for Afghan women if the world doesn’t stand with them. pic.twitter.com/p2p0b0QGRR
— Sara Wahedi (@SaraWahedi) January 18, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

