ఇస్లామాబాద్: ఆప్ఘనిస్థాన్ తాలిబన్ ప్రభుత్వ దళాలు శనివారం పాక్ సరిహద్దు ప్రాంతంలోని కుర్రమ్పై దాడులు చేశాయి. పాక్ ప్రతిస్పందిస్తూ దాడులు చేసింది. ఈ దాడుల్లో ముగ్గురు ఆప్ఘన్ సైనికులు, ఓ పాకిస్థానీ సైనికుడు మరణించారు. తొమ్మిది మంది పాకిస్థానీలు గాయపడ్డారు.
దండే పటన్-కుర్రమ్ సరిహద్దు ప్రాంతంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు పక్తియా సరిహద్దు ప్రాంతంలోనూ దాడులు జరుగుతున్నాయి. . దాడుల కారణంగా ఆఫ్ఘన్లోని ఖోస్ట్ పట్టణవాసులు తమ ఇండ్లను వదిలి వెళ్లిపోతున్నారు. పాకిస్థాన్ 24న అఫ్ఘన్పై దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.