Accident in North Sea : ఉత్తర సముద్రం (North Sea) లో భారీ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ (Oil tanker) ను కార్గో నౌక (Cargo ship) ఢీకొట్టింది. దాంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆయిల్ ట్యాంకర్‌తోపాటు నౌక ఆ మంటల్లో చిక్కుకున్నాయి. ఈ విషయాన్ని బ్రిటన్ కోస్ట్‌గార్డ్ వెల్లడించింది. హల్ తీరంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపింది.
అమెరికాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ‘ఎంవీ స్టెనా’ను స్కాట్లాండ్ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్తున్న కార్గో నౌక ‘సోలాంగ్’ ఢీకొట్టినట్లు వెల్లడించింది. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్ భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అగ్నిమాపక సిబ్బంది సహా కోస్ట్‌గార్డ్ రెస్క్యూ హెలికాప్టర్, అనేక లైఫ్ బోట్లు ఘటనా ప్రదేశానికి చేరుకున్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అందులోని సిబ్బంది తప్పించుకున్నారు. ఆ తర్వాత మంటలు చెలరేగాయి. దాంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ భారీగా ఆస్తినష్టం సంభవించింది. రాయల్ నేషనల్ లైఫ్‌బోట్ ఇన్స్టిట్యూట్ (RNLI) ఏజెన్సీ రెస్క్యూ ఆపరేషన్ వివరాలను వెల్లడించింది.