Iran | ఇరాన్ (Iran) సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే, అక్కడి అధికారులు నిరసనకారులను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. ఇక ఇప్పటి వరకూ ఈ ఆందోళనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు (Iranian official) తాజాగా ప్రకటించారు.
ఇప్పటి వరకూ సుమారు 2 వేల మంది మరణించినట్లు (2,000 people killed) ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఈ మరణాలకు ఉగ్రవాదులే కారణమని వారు ఆరోపించారు. అయితే, భద్రతా దళాల కాల్పుల వల్లే పౌరులు మరణించినట్లు మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అక్కడ ఇంటర్నెట్ నిలిపివేశారు. దీంతో మరణాలపై పూర్తి వివరాలు తెలియడం లేదు.
ఇదిలా ఉండగా.. ఇరాన్ విషయంలో ట్రంప్ వైఖరిని ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్రంగా తప్పుబట్టారు. ముందు మీ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోండి అంటూ చురకలంటించారు. అయినా ట్రంప్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్ర హెచ్చరికలు చేశారు. అమెరికా తన మోసపూరిత చర్యలను, నమ్మక ద్రోహులైన కిరాయి వ్యక్తులపై ఆధారపడటాన్ని తక్షణమే నిలిపి వేయాలని హెచ్చరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఖమేనీ ఓ పోస్టు పెట్టారు.
‘ఇరాన్ శత్రువులకు భయపడదు. ఈ విషయాన్ని చాలా సార్లు చాటిచెప్పాం. ఇప్పటికైనా అమెరికా రాజకీయ నాయకులు మోసపూరిత చర్యలను తక్షణమే ఆపేయాలి. మా దేశానికి ద్రోహం చేస్తున్న కిరాయి వ్యక్తులపై ఆధారపడటాన్ని ఆపేయాలని హెచ్చరిస్తున్నాం. ఇరాన్ బలమైన, శక్తిమంతమైన దేశం. ఇరాన్ ప్రజలు చాలా చైతన్యవంతులు. వారికి శత్రువు ఎవరో తెలుసు. వారిని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని ఖమేనీ హెచ్చరించారు.
Also Read..
Greenland | గ్రీన్లాండ్ స్వాధీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా
Love Insurance: లవ్ ఇన్సూరెన్స్ పాలసీతో జాక్‌పాట్ కొట్టేసిన చైనీస్ మహిళ
Ayatollah Ali Khamenei | మోసపూరిత చర్యలను ఆపండి.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్