వాషింగ్టన్: భూమి నెమ్మదిగా తన సహజ ప్రకాశాన్ని కోల్పోతున్నదని నాసా సహకారంతో జరిగిన తాజా అధ్యయనం వెల్లడించింది. భూమి గతంలో కన్నా ఎక్కువగా సూర్య కాంతిని శోషించుకుంటున్నదని తెలిపింది. దీనివల్ల భూమిపై సున్నితమైన వాతావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించింది. దక్షిణార్ధ గోళం కన్నా ఉత్తరార్ధ గోళం వేగంగా చీకటిమయం అవుతున్నదని తెలిపింది.
ఇటువంటి అంధకార ఫలితం వల్ల వర్షపాతం, ఉష్ణోగ్రతలు వంటి ప్రపంచ వాతావరణ వ్యవస్థలపై దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ అధ్యయన నివేదికను పీఎన్ఏఎస్ ప్రచురించింది. ఉపగ్రహం ద్వారా సేకరించిన 24 సంవత్సరాల సమాచారాన్ని విశ్లేషించి, ఈ నివేదికను రూపొందించారు.