కౌలాలంపూర్: మలేషియాలోని కౌలాలంపూర్ వెలుపల చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంతో ఆకాశంలోకి అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. సుమారు 20 అంతస్తుల ఎత్తులో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. పరిసర ప్రాంతాలలో పెద్ద గొయ్యి ఏర్పడింది.
ఈ ప్రమాదంలో 145 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం కారణంగా 190 ఇండ్లు, 148 కార్లు ధ్వంసమైనట్టు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.