ప్రేమ అనేది చాలా గొప్పది. మొదటిసారి ప్రేయసికి ప్రియుడు లవ్ ప్రపోజ్ చేసే సందర్బం వారికి జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆ మధురానుభూతిని ఆ జంట ఎప్పటికీ మర్చిపోదు. కాగా, ఓ మారథాన్‌లో పాల్గొన్న తన ప్రేయసి ఫినిష్లైన్ వద్దకు రాగానే ప్రియుడు కాళ్లపై కూర్చొని లవ్ ప్రపోజ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
న్యూయార్క్‌లోని బఫెలో మారథాన్ ముగింపులో క్రిస్టోఫర్ జేమ్స్ అనే వ్యక్తి ఒక మోకాలిపై కూర్చొని మాడిసన్ మహర్‌ని తనను పెళ్లి చేసుకోవాలని అడిగాడు. మారథాన్ ఫినిష్లైన్పైకి చేరుకోగానే తన ప్రియుడి ప్రపోజల్ అందుకున్న మాడిసన్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. క్రిస్ తన శిక్షణకు వెన్నెముక అని పేర్కొంది. మారథాన్ ఫినిష్లైన్ తన జీవితానికి స్టార్‌లైన్ అయ్యిందంటూ సంబురపడిపోయింది. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 2.5లక్షల మంది లైక్ చేశారు. ఈ ప్రపోజల్ సింపుల్‌గా, బ్యూటీఫుల్‌గా ఉందని నెటిజన్లు పేర్కొన్నారు.