Aliens | న్యూయార్క్, జూన్ 13: ఏలియన్లు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? భూమిపైకి వస్తున్నారా? ఎవరితో సంబంధం కలిగి ఉన్నారు? అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు. అయితే, ఏలియన్లు భూమ్మీద నివసిస్తున్నారేమోనని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మనుషుల్లా వేషధారణ మార్చుకొని భూమిపై మనుగడ సాగిస్తుండొచ్చని హార్వర్డ్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. యూఎఫ్‌వోలు అనేవి భూమిపై ఉన్న ఏలియన్ స్నేహితులను కలిసేందుకు గ్రహాంతర వాసులు వినియోగించే స్పేష్షిప్లు అయ్యుండొచ్చని వారు అంచనా వేశారు.