యూఎస్‌లో ఆటిజంతో బాధపడుతున్న ఓ నాలుగేళ్ల బాలుడు స్విమ్మింగ్‌ఫూల్‌లో దూకాడు. ఈతరాక నీళ్లల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇది గమనించిన మరో బాలుడు పరుగున వెళ్లి తన నాన్నకు విషయం చెప్పాడు. అతడొచ్చి ఆటిజం బాలుడి ప్రాణాలు కాపాడాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
యూఎస్‌లోని కాన్సాస్కు చెందిన లిటిల్ జేవియర్ రిగ్నీ అనే నాలుగేళ్ల బాలుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. తన తల్లి చూడనప్పుడు స్విమ్మింగ్‌ఫూల్‌లో దూకాడు. అక్కడే కంచె వెనుక ఉన్న మాడాక్స్ వెస్టర్హౌస్ అనే 12 ఏళ్ల బాలుడు చూసి, సమీపంలోని అపార్ట్మెంట్లో ఉండే తన తండ్రి టామ్‌కు విషయం చెప్పి, తీసుకొచ్చాడు. టామ్, మాడాక్స్ సమయానుకూలంగా స్పందించడంతో జేవియర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో చూసినవారంతా జేవియర్‌ను కాపాడిన తండ్రీకొడుకులు మాడాక్స్, టామ్‌ను హీరోలంటూ కొనియాడుతున్నారు.