వాషింగ్టన్, ఫిబ్రవరి 16 : చేయని నేరానికి ఏకంగా 37 ఏండ్లు జైలు శిక్ష అనుభవించిన బాధితుడికి పరిహారంగా రూ.116 కోట్లు చెల్లించాలని అమెరికాలోని ఓ కోర్టు ఆదేశించింది. లైంగికదాడి, హత్య ఆరోపణలపై ఫ్లోరిడాకు చెందిన రాబర్ట్ డుబోయిస్ను 1982లో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికి అతని వయసు 18 ఏండ్లు. మొదట అతడికి కోర్టు మరణశిక్ష విధించింది.
అనంతరం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇన్నోసెంట్ ప్రాజెక్ట్ ఆర్గనైషన్ సహకారంతో 2018లో అతడు అప్పీల్ చేయడంతో కేసును తిరిగి విచారణ చేయడానికి ప్రాసిక్యూషన్ అంగీకరించింది. అనంతరం అతడు నిర్దోషిగా తేలాడు. దీంతో అతడు తన కేసు దర్యాప్తు చేపట్టిన తంపా సిటీ పోలీసులపై దావా వేశాడు. బాధితుడికి 116 కోట్లు పరిహారం చెల్లించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.