Oldest Bread : ప్రపంచంలో అత్యంత పురాతన బ్రెడ్‌ను టర్కీ పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 8600 ఏండ్ల నాటి బ్రెడ్‌ను శాస్త్రవేత్తలు గుర్తించగా ప్రాచీన కాలంలో ప్రజల ఆహార అలవాట్లు, అప్పటి నాగరికతకు ఆనవాళ్లను ఇది పట్టి ఇస్తుందని భావిస్తున్నారు. దక్షిణ టర్కీ కోన్యా ప్రావిన్స్‌లో కటాల్యోయుక్ వద్ద పురాతత్వ ప్రదేశానికి సమీపంలో లభించిన ఈ బ్రెడ్ గుండ్రంగా అరచేతి మందంతో మెత్తటి పదార్ధం వ్యర్ధాలతో కనిపించింది.
పక్కనే గోధుమ, బార్లీ, బఠానీ గింజలున్నాయని పురాతత్వ శాస్త్రవేత్తలు తెలిపారు. పురాతన బ్రెడ్ వెలికితీత అసాధారణమని, ఇదే ప్రపంచంలో అత్యంత పురాతన బ్రెడ్ అని తవ్వకాల ప్రతినిధి బృందం చీఫ్, అనడోలు యూనివర్సిటీ, టర్కీ ప్రొఫెసర్, పురావస్తు శాస్త్రవేత్త అలీ ఉముత్ టర్కన్ చెప్పారు. తాము కనుగొన్న బ్రెడ్‌ను రొట్టె స్మాలర్ వెర్షన్‌గా టర్కన్ అభివర్ణించారు.
బ్రెడ్ మధ్యలో వేలిని నొక్కి ఉంచిన టర్కన్ దీన్ని కుక్ చేయలేదు కానీ పులియబెట్టిన సంకేతాలున్నాయని అన్నారు. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఇమేజ్‌లను స్కాన్ చేసిన అనంతరం బ్రెడ్ తయారీ కోసం పిండి, నీరు కలిపినట్లు తమ విశ్లేషణలు వెల్లడించాయని బ్రెడ్‌ను ఓవెన్ పక్కన సిద్ధం చేసి కాసేపు ఉంచినట్టు టర్కీలోని గజియన్‌టెప్ యూనివర్సిటీ లెక్చరర్, బయాలజిస్ట్ సలిహ్ కవక్ తెలిపారు.
Read More :
Sea Turtle meat | తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత