అమెరికా: ప్రవాస భారతీయులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వత్రా శుక్రవారం తెలిపారు. ఇందులో భాగంగా కొత్తగా ఎనిమిది దౌత్య దరఖాస్తు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కేంద్రాలు అమెరికాలోని లక్షలాది మంది భారతీయులకు పాస్‌పోర్ట్, వీసా, ఓవర్సీస్ సిటిజెన్షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) కార్డు దరఖాస్తు ప్రక్రియ సహా వివిధ సేవలను సులభతరం చేస్తాయని చెప్పారు.
ఈ మేరకు వివరాలను ఎక్స్‌లో వీడియో పోస్ట్ చేశారు. కొత్తగా దౌత్య దరఖాస్తు కేంద్రాలను బోస్టన్, కొలంబస్, డాలస్, డిట్రాయిట్, అడిసన్, ఒర్లాండో, రాలెయిగ్, శాన్‌జోస్ ప్రాంతాల్లో నెలకొల్పామని పేర్కొన్నారు.