గురువారం 02 జూలై 2020
International - Jun 06, 2020 , 18:02:45

రష్యాలో 4.58లక్షలు దాటిన కరోనా బాధితులు

రష్యాలో 4.58లక్షలు దాటిన కరోనా  బాధితులు

మాస్కో  రష్యాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఆ దేశంలో రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో రష్యా మూడో స్థానంలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 8,855 మందికి  కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అలాగే మరో 197 మంది కరోనా వల్ల చనిపోయారు. 

రష్యాలో మొత్తం బాధితుల సంఖ్య 4,58,689కు పెరిగింది. కరోనా బారినపడి  5,725 మంది మృతిచెందారు. ప్రస్తుతం 3,17,000 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నేటి వరకు కోటి 20లక్షల మందికిపైగా కరోనా టెస్టులు నిర్వహించారు.  


logo