Earthquake | జపాన్ (Japan)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. నైరుతి దీవులైన క్యుషు, షికోకును శక్తివంతమైన భూకంపం వణికించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 7.1గా నమోదైంది. భూకంపం ధాటికి భారీ భవంతులు ఊగిపోయాయి. ఈ భూ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు.
మరోవైపు భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు పలు ప్రాంతాలకు సునామీ (tsunami) హెచ్చరికలు చేశారు. మియాజాకి, కొచ్చి, ఓయిటా, కగోషిమా, ఎహిమ్ ప్రిఫెక్చర్లకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇక క్యుషులోని మియాజాకి ప్రిఫెక్చర్లో ఇప్పటికే 20 సెంటీమీటర్ల ఎత్తు మేర అలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read..
Waqf Bill | వక్ఫ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
Bangladesh crisis | బంగ్లాలో అస్థిర పరిస్థితులు.. భారత వీసా సెంటర్లు మూసివేత
Muhammad Yunus | బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్ ప్రమాణం