Earthquake | నేపాల్లో భూకంపం.. ఉత్తర భారతంలో ప్రకంపణలు
హిమాలయ దేశం నేపాల్లో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున సింధుపల్చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయింది. భైరవకుండ సమీపంలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఖాట్మండూ: హిమాలయ దేశం నేపాల్లో భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున సింధుపల్చోక్ జిల్లాలోని భైరవకుండ వద్ద భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదయింది. భైరవకుండ సమీపంలోనే భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. దుగుంగడి భీర్లో కొండచరియలు విరిగిపడ్డాయని, అయితే ఆ ప్రదేశంలో ఇండ్లు లేవని చెప్పారు. భారత్తోపాటు చైనా, టిబెట్ సరిహద్దుల్లో కూడా భూమి స్వల్పంగా కంపించదన్నారు.
An earthquake with a magnitude of 5.5 on the Richter Scale hit Nepal at 2.36 IST today.
(Source – National Center for Seismology) pic.twitter.com/OtockGLncO
— ANI (@ANI) February 27, 2025
నేపాల్ భూకంప ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. బీహార్ రాజధాని పాట్నాతోపాటు పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, పాట్నాలో భూకంపానికి సంబంధించి పలు వీడియోలను పలువురు సోషల్ మీడియాలు పోస్టు చేశారు. 35 సెకండ్లపాటు భూమి కంపించిందని, దీంతో ఇండ్లలో ఫ్యాన్లు, వస్తువులు ఊగిపోయాయని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో టిబెల్లో వరుసగా ఆరుసార్లు భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో 7.1 తీవ్రత నమోదవగా, 125 మందికిపైగా మరణించారు.
Un sismo de magnitud 5.5 sacudió hoy cerca de Kathmandu, Nepal. El sismo se sintió con fuerza en la India, Bután y Bangladesh. Sin embargo, no se reportan víctima ni daños. #earthquake pic.twitter.com/X49YtPaUrf
— Centinela35 (@Centinela_35) February 28, 2025
#Earthquake jolts #Patna at 2:37 am pic.twitter.com/6EpPy473ZN
— K Sarvottam (@k_sarvottam21) February 27, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

