57,000 ఏళ్లనాటి తోడేలు కళేబరం అట్లాగే ఉందట..!

జంతువులు చనిపోయాక వాటి శరీరాలు కొద్దిరోజుల్లోనే కుళ్లిపోతాయి. కానీ ఉత్తర కెనడాలో దొరికిన ఓ తోడేలు కళేబరం 57,000 ఏళ్లుగా అలాగే ఉందట. దాని జుట్టు, దంతాలు, చర్మం పాడవకుండా కనిపించాయట. అది మంచులో ఉండడం వల్లే కుళ్లిపోకుండా ఉండగలిగిందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తర కెనడాలోని యుకాన్ ప్రాంతంగల డాసన్ సిటీ సమీపంలో గోల్డ మైనర్స్ తవ్వకాల్లో అ అవశేషాలు బయటపడ్డాయి. ఇది ఏడువారాల వయస్సుగల ఆడతోడేలు కళేబరమని పరిశోధకులు తేల్చారు. డెన్ కూలడంతో అది మరణించినట్లు అంచనావేశారు. దీనికి ‘ఝుర్’గా నామకరణం చేశారు. అంటే హాన్ భాషలో తోడేలు అనే అర్థం వస్తుంది. ‘ఆ తోడేలు కళేబరం వందశాతం చెక్కుచెదరకుండా ఉంది. కేవలం కళ్లు మాత్రమే కోల్పోయింది. తోడేలు జీవితాన్ని ప్రాథమికంగా పునర్నిర్మించడానికి కళేబరం మాకు చాలా ఉపయోగపడింది.’అని డెస్ మోయిన్స్ విశ్వవిద్యాలయంలో అనాటమీ ప్రొఫెసర్ జూలీ మీచెన్ పేర్కొన్నారు.
ఇవికూడా చదవండి..
కరోనా మ్యుటేషన్‌ను అడ్డుకునే టీకాను సృష్టిస్తాం
వ్యాక్సిన్‌లో పంది మాంసం.. వ్యతిరేకిస్తున్న ముస్లిం దేశాలు!
అదుపులోనే కొత్త రకం కరోనా: డబ్ల్యూహెచ్‌వో
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఎస్సెస్సీ పోటీ పరీక్షల కోసం టీశాట్ ప్రసారాలు
- బక్కచిక్కిన ముద్దుగుమ్మ.. నమ్మలేకపోతున్న ఫ్యాన్స్
- వాహ్.. వాగులో వాలీబాల్..!
- ఆంబోతుల ఫైట్.. పంతం నీదా..? నాదా..?
- పోలీసు మానవత్వం.. మూగజీవాన్ని కాపాడాడు..
- ప్రముఖ టిక్ టాక్ స్టార్ ఆత్మహత్య.. నెల్లూరు టౌన్లో కలకలం
- తెలంగాణ కశ్మీరం @ ఆదిలాబాద్
- అనుకోకుండా కలిసిన 'గ్యాంగ్ లీడర్' బ్రదర్స్
- హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- లాఠీ వదిలి క్రికెట్ బ్యాట్ పట్టిన సీపీ