కౌంగ్ తాట్: మయన్మార్(Myanmar)లో జరిగిన పేలుడు ఘటనలో 55 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. షాన్ స్టేట్‌లో ఉన్న కాంగ్ తాట్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇది చైనా బోర్డర్‌కు సమీపంలో ఉంటుంది. ఈ దుర్ఘటనలో డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. కౌంగ్ తాట్లో సుమారు 200 ఇండ్లకు నష్టం జరిగింది. సమీపంలోని పాన్ లోన్ గ్రామంలో మరో 100 ఇండ్లకు నిప్పు అంటుకున్నది. కౌంగ్ తాట్ గ్రామం టీఎన్‌ఎల్‌ఏ రెబల్స్ గ్రూపు సంస్థ ఆధీనంలో ఉన్నది. జుంటా మిలిటరీతో ఆ గ్రూపు ఫైట్ చేస్తున్నది. అయితే మైనింగ్ కోసం ఓ వేర్‌హౌజ్‌లో పెట్టిన పేలుడు పదార్ధాలు పేలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆదివారం రోజునే సుమారు 46 మంది భౌతికదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ ప్రమాద ఘటన స్థలం వద్ద ఇవాళ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గాయపడ్డ సుమారు 74 మందిని నామ్‌ఖామ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.