నైరోబీ : కెన్యాలో 28 మంది భారతీయుల బృందం ప్రయాణిస్తున్న బస్సు లోయలోకి పడిపోవడంతో ఐదుగురు మృతి చెందారు. సోమవారం ఈ ప్రమాదం జరిగిందని ఖతార్‌లోని భారత ఎంబసీ ఎక్స్‌లో తెలిపింది.
మృతులంతా ఖతార్‌లో నివసిస్తున్న భారతీయులని తెలిపింది. గల్ఫ్ టైమ్స్ దిన పత్రిక కథనం ప్రకారం న్యాన్డరువా ఈశాన్య కౌంటీలో ప్రయాణిస్తున్న పర్యాటకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. మృతులు కేరళకు చెందినవారు.