Earthquake | పాకిస్థాన్లో భారీ భూకంపం.. 12 గంటల్లో మూడుసార్లు..
పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 3.54 గంటల సమయంలో పాక్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. ఆదివారం తెల్లవారుజామున 3.54 గంటల సమయంలో పాక్లో భూమి కంపించింది. దీని తీవ్రత 5.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 150 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
కాగా, శనివారం పాక్లో రెండు సార్లు భూమి కంపించింది. సాయంత్రం 6.53 నుంచి 7 గంటల మధ్య రెండు భూకంపాలు వచ్చాయి. తొలుత 4.4 తీవ్రతతో ప్రకంపణలు చోటుచేసుకోగా, రెండో సారి 3.2 తీవ్రతతో భూమి కంపించింది. కరాచీలో కూడా భూ ప్రకంపణలు సంభవించాయి. ఈ నెల 1 నుంచి పాకిస్థాన్లో 21 సార్లు భూకంపం రావడం గమనార్హం.
EQ of M: 5.2, On: 29/06/2025 03:54:02 IST, Lat: 30.25 N, Long: 69.82 E, Depth: 150 Km, Location: Pakistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/QO5B8YcWFD— National Center for Seismology (@NCS_Earthquake) June 28, 2025
శుక్రవారం రాత్రి అండమాన్ సముద్రంలో కూడా భూకంపం సంభవించింది. రాత్రి 8.28 గంటల సమయంలో 4.6 తీవ్రతతో భూమి కంపించినట్లు ఎన్సీఎస్ వెల్లడించింది. భూమికి 25 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రం ఉన్నదని తెలిపింది. అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్బ్లెయిర్కు 254 కి.మీ ఆగ్నేయంలో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. ఈ భూ ప్రకంపనలతో సముద్రం ఒక్కసారిగా అల్లకల్లోలంగా మారింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Earthquake
- Karachi
- NCS
- Pakistan
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

