సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 01:04:10

27 మంది తాలిబన్‌ ఉగ్రవాదుల హతం..

27 మంది తాలిబన్‌ ఉగ్రవాదుల హతం..

కాబూల్‌ :  ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ ప్రావిన్స్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ జాతీయ ఆర్మీలోని 20 అటల్‌ పోలీసులకు, ఉగ్రవాదులకు నడుమ జరిగిన ఘర్షణలో 26 మంది తాలిబన్‌ ఉగ్రవాదులు హతం కాగా 16 మందికి గాయాలయ్యాయని ఆఫ్ఘనిస్థాన్‌ జాతీయ ఆర్మీ అధికారులు గురువారం తెలిపారు. తాలిబన్‌ తిరుగుబాటుదారులు బుధవారం రాత్రి కలన్‌కేచ, మోషన్‌, మైవాండ్‌ జిల్లాల్లోని చెక్‌పోస్టులపై దాడి చేశారు. ఈ దాడుల తరువాత అదేప్రాంతంలో ఈ రోజు సాయంత్రం ఆప్ఘనిస్తాన్‌ జాతీయ ఆర్మీకి తాలిబన్‌ తిరుగుబాటుదారులకు మధ్య ఘర్షణ జరిగింది.

ఇందులో 26మంది తిరుగుబాటుదారులు మృతి చెందగా మరో 16 మందికి గాయాలయ్యాయని ఆర్మీ అధికార ప్రతినిధి  అహ్మాద్‌ సిద్దిఖ్‌ ఇసా తెలిపారు. ఘర్షణలో ఏ ఒక్క ఆర్మ జవాన్‌కు
 గాయపడలేదని ఆయన వెల్లడించారు. ఆఫ్ఘన్‌ శాంతి చర్చలను ప్రారంభించడానికి కాబూల్ ప్రభుత్వం, తాలిబాన్లకు జరుగుతున్న ప్రయత్నాల నడుమ దేశంలో ఉల్లంఘనలు ఉద్రికత్తకు దారి తీశాయి. ఇది రాష్ట్రాల నడుమ ఖైదీ మార్పిడికి దారితీసింది.logo