పెషావర్: పాకిస్థాన్లోని ఖైబర్పఖ్తుంఖ్వా రాష్ట్రంలో సైనిక శిబిరంపై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో శిబిరంపైకి దూసుకెళ్లారు. దీంతో 25 మంది సైనికులు మరణించారు. పేలుడు ధాటికి సైనిక శిబిర భవనం కుప్పకూలిందని అధికారులు తెలిపారు. అనంతరం తేరుకున్న జవాన్లు ఎదురుదాడి జరిపి ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారని వెల్లడించారు. మరో ఘటనలో ఇదే రాష్ట్రంలో ఉగ్రవాద స్థావరాన్ని జవాన్లు గుర్తించారు. దానిపై దాడి చేసి 17 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.