Haiti Tanker Blast : హైతీ దేశంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలడంతో 25 మంది మృతి చెందారు. మరో 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పెట్రోల్ ట్యాంకర్ అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో.. స్థానికులు పెద్ద సంఖ్యలో ఆ పెట్రలో కోసం ఎగబడ్డారు.
దాంతో ఒక్కసారిగా పెట్రోల్‌కు మంటలు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని నిమిషాల్లోనే ఘోరం జరిగింది. కాగా హైతీ తాత్కాలిక ప్రధాని గ్యారీ కొనిల్ ఘటనా ప్రాంతాన్ని సందర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.