మెక్సికన్ సిటీ: మెక్సికన్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన యువతి టిక్‌టాక్ లైవ్‌లో మాట్లాడింది. ఒక వ్యక్తి ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. (Mexican Influencer Dies in TikTok Live) దీంతో లైవ్‌స్ట్రీమింగ్ చేస్తుండగానే ఆమె మరణించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 23 ఏళ్ల మెక్సికన్ యువతి వలేరియా మార్క్వెజ్, సోషల్ మీడియాలో బాగా ప్రచుర్యం పొందింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
కాగా, వలేరియా మార్క్వెజ్ పింక్ డ్రెస్ ధరించింది. టిక్‌టాక్ లైవ్‌లో తన ఫాలోవర్స్‌తో మాట్లాడేందుకు ఆమె సిద్ధమైంది. తల సరిచేసుకున్నది. అందరికీ హాయ్ అని చెప్పింది. ఇంతలో ఆమె శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. దీంతో లైవ్‌స్ట్రీమింగ్ జరుగుతుండగానే వలేరియా ఒక పక్కకు ఒరిగిపోయి మరణించింది. లైవ్‌లో ఇది చూసి ఆమె ఫాలోవర్స్ షాక్ అయ్యారు.
మరోవైపు బైక్‌పై వచ్చిన వ్యక్తి డెలివరీ బాయ్‌గా నమ్మించి గిఫ్ట్ ఇచ్చేందుకు వలేరియా వద్దకు వెళ్లాడని పోలీసులు తెలిపారు. ఆమె పేరు అడిగి మరీ ఛాతీ, తలపై మూడు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయాడని చెప్పారు. నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మెక్సికో పోలీసులు వెల్లడించారు. కాగా, ఈ షాకింగ్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
🚨😲😲Está difícil ser influencer no México pic.twitter.com/etQxm4Ijcf
— Diego mello (@hdiegorj) May 14, 2025