కరాచీ: పాకిస్థాన్(Pakistan)లోని బలోచిస్తాన్లో ఉన్న ముసాఖేల్ జిల్లాలో.. ఉగ్రవాదులు 23 మంది ప్రయాణికుల్ని కాల్చి చంపారు. ట్రక్కులు, బస్సుల్లో ఉన్న ప్రయాణికుల్ని దించి తమ వద్ద ఉన్న తుపాకులతో షూట్ చేశారు. ఐడెంటీలను గుర్తించిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ముసాఖేల్, రారాషామ్ హైవేపై బస్సులను ఆపి, దాంట్లో నుంచి ప్రయాణికుల్ని దించి, వాళ్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అసిస్టెంట్ కమీషనర్ ముసాఖేల్ నజీబ్ కాకర్ తెలిపారు. కాల్పుల్లో చనిపోయిన వారు అంతా పంజాబ్‌కు చెందినట్లు ఆయన చెప్పారు. మొత్తం 10 వాహనాలకు సాయుధులు నిప్పుపెట్టారు. ఈ ఉగ్ర చర్యను బలోచిస్తాన్ సీఎం సర్ఫరాజ్ బుగ్తి ఖండించారు.